తెలుగు వారి వంకాయ నువ్వుల కారం నచ్చని వారు తిన్నాక కూర రుచిని మరిచిపోయే వారు ఎవరైనా ఉంటారా అసలు? అని వంకాయ నువ్వుల కూర తిన్న ఎవ్వరైనా చెప్పే మాట.

కారంగా ఘాటుగా పుల్లగా కమ్మగా, ఇంకా ఘుమఘుమలాడిపోతూ ఉండే ఈ వంకాయ కూర చేయడం చాలా సులభం. నువ్వుల కారం గ్రైండ్ చేసుకుని వేపున్న వంకాయలో కలుపుకోవడమే!

రోజూ వారి చేసుకునే సింపుల్ కూరగా పర్ఫెక్ట్. కేవలం 20 నిమిషాల్లో తయారు. ఈ కూరతో పాటు ఏదైనా రసం లేదా సాంబార్ చేసుకుంటే భోజనానికి పరిపూర్ణత వచ్చేస్తుంది.

తెలుగు వారికీ కూరల్లో రారాజు వంకాయ అందుకే తెలుగు వారికి దేశం మిగిలిన వారికంటే ఎన్నో రకాల వంటకాలు ఉన్నాయ్. అన్నీ చూడ్డానికి చాలా దగ్గరగా, ఒకేలా ఉన్నాయ్ కదా… చిన్న మార్పు అంతే!!! అని అనిపిస్తాయి, కానీ కాదు. తిన్నకే తెలుస్తుంది ఆ కూర్ రుచేంత గొప్పగా ఉంటుందో.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు గుత్తి వంకాయ మలాయి కుర్మా

టిప్స్

వంకాయలు:

  1. ఈ కూరకి తెలుగు వారు ముఖ్యంగా ఆంధ్రులు పొడవు లేత నీలం రంగు వంకాయలనే వాడతారు. ఏవ్ రుచి అంటుంటారు. గుత్తి వంకాయలని, తెల్ల వంకాయలని, పెద్ద వంకాయని వాడరు . నచ్చితే మీరు వాడుకోవచ్చు. ఏది వాడినా గింజలు లేని లేత వంకాయ అయితేనే అసలైన రుచి అని గుర్తుంచుకోండి.

  2. గింజలేని లేత వంకాయలు నోట్లో మీగడలా కరిగిపోతాయి.

నువ్వుల కారం:

  1. నువ్వులు సన్నని సెగ మీద వేగితే లోపలి దాకా చిట్లి మాంచి సువాసనతో ఉంటుంది కారం.

ఎండుమిర్చికి బదులు :

  1. ఈ నువ్వుల కారంలో ఎండుమిర్చి వేస్తారు. నచ్చితే మీరు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసి కూడా చేసుకోవచ్చు, అది ఇంకో రుచి.

బెల్లం:

  1. బ్రాహ్మణ కుటుంబాల వారు ఆఖరున కొద్దిగా బెల్లం వేస్తారు. నిజానికి వేసే ఆ కొద్ది బెల్లం రుచి ఫ్లేవర్స్ని బాలన్స్ చేసి కూరకి మాంచి రుచినిస్తుంది.

వంకాయ నువ్వుల కూర - రెసిపీ వీడియో

Brinjal Sesame Spicy Curry | Vankaya Nuvvula Kura | How to Make Vankaya Nuvvula kura

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Serves 5

కావాల్సిన పదార్ధాలు

  • నువ్వుల కారం కోసం:
  • 3 tbsp నువ్వులు
  • 6-7 Cloves వెల్లులి
  • 8-10 ఎండుమిర్చి
  • 1/2 Kg లేత నీలం రంగు పొడవు వంకాయలు
  • కూర కోసం:
  • 3 tbsp నూనె
  • 1 tbsp ఆవాలు
  • 1 tbsp జీలకర్ర
  • 2 Sprigs కరివేపాకు
  • 1 tbsp ధనియాల పొడి
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 1/2 tbsp పసుపు
  • 1/4 Cup చింతపండు పులుసు (ఉసిరికాయ సైజు అంత చింతపండు నుండి తీసినది)
  • కొత్తిమీర (కొద్దిగా)
  • 1 tbsp కారం

విధానం

  1. పాన్లో నువ్వులు వెల్లులి ఎండుమిర్చి వేసి నెమ్మదిగా వేపి మిక్సీలోకి తీసుకుని నీలతో మెత్తని పేస్ట్ చేసుకోండి
  2. అదే పాన్లో నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేపుకోండి
  3. వేగిన తాలింపులో వంకాయ ముక్కలు, పసుపు ,ఉప్పు, ధనియాల పొడి వేసి వంకాయ ముక్కలు రంగు మారేదాకా వేపుకోండి.
  4. వేగిన వంకాయ ముక్కల్లో నువ్వుల కరం పేస్ట్ కొద్దిగా నీళ్లు చింతపండు పులుసు పోసి,కారం కలిపి నూనె పైకి తేలేదాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి
  5. నూనె పైకి తేలాక కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.